Thu Dec 18 2025 10:11:08 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ లో చేరుతున్న బాబూమోహన్ కుమారుడు
ఆంధోల్ బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్ కుమారుడు బీఆర్ఎస్లో చేరుతున్నారు.

ఆంధోల్ బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్ కుమారుడు బీఆర్ఎస్లో చేరుతున్నారు. బాబూ మోహన్ కుమారుడు ఉదయ బాబు హరీశ్ రావు సమక్షంలో కారు పార్టీలో చేరునున్నారని తెలిసింది. సిద్ధిపేట్ లో హరీశ్ రావును కలసి ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. బాబూ మోహన్ ఈ ఎన్నికల్లో ఆంథోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
టిక్కెట్ దక్కలేదని...
అయితే ఆంథోల్ నియోజకవర్గం టిక్కెట్ ను ఉదయ్ బాబు ఆశించారు. అది తనకు కాకుండా తండ్రికి దక్కడంతో ఆయన ఆగ్రహం చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి టిక్కెట్ ఇస్తే తనయుడికి ఆగ్రహమేంటని ఉదయ్ పై బాబూ మోహన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా రాజకీయం రాజకీయమే.. సీటు.. సీటే.. పార్టీ.. పార్టీయే నంటూ ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
Next Story

