Thu Jan 29 2026 08:23:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేసీఆర్ కు నేడు సిట్ నోటీసులు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేడు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశముంది

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేడు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే దూకుడు పెంచిన సిట్ అధికారులు అనేక మందిని విచారించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులను కూడా సిట్ అధికారులు ఇప్పటికే విచారణ చేసిన సంగతి తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
అయితే తర్వాత నోటీసులు కేసీఆర్ కు ఇస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఈ విచారణలో వెల్లడయిన విషయాలను బట్టి కేసీఆర్ ను కూడా విచారించాలని సిట్ అధికారుల నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశముంది. అయితే ఆయన ఆరోగ్యం, వయసు దృష్ట్యా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రానికి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశముంది.
Next Story

