Sat Jan 31 2026 05:49:55 GMT+0000 (Coordinated Universal Time)
KCR : రేపు సిట్ ఎదుటకు కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ కు సిట్ అధికారులు అందచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ అధికారులు నందినగర్ లోనే విచారిస్తామని తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
వాస్తవానికి మొన్ననే కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేయాల్సి ఉండగా, తనకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొన్ని బాధ్యతలున్నందున మరొక తేదీని నిర్ణయించాలని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో రేపు విచారించాలని సిట్ అధికారుల నిర్ణయించారు. అయితే కేసీఆర్ చెప్పినట్లు ఫామ్ హౌస్ లో కాకుండా నందినగర్ లోని ఆయన నివాసంలోనే విచారణ చేస్తామని తెలిపారు. మరి కేసీఆర్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
Next Story

