Thu Mar 19 2026 08:01:19 GMT+0530 (India Standard Time)
మాజీ కలెక్టర్ పై నేడు హైకోర్టులో విచారణ
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేసి ఇటీవల ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన రాజీనామాను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో...
రీసెర్చ్ స్కాలర్స్ సుబేందర్ సింగ్, జె.శంకర్ లు హైకోర్టులో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని, ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆమోదిస్తుందని వారు ప్రశ్నించారు. ఈ పిటీషన్ లో శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
Next Story

