Sun Mar 15 2026 23:27:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కలెక్టర్ రాజీనామా.... ఆ పార్టీలో చేరేందుకేనా?
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన త్వరలో టీఆర్ఎస్ లో చేరే అవకాశముందని తెలుస్తోంది

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన త్వరలో టీఆర్ఎస్ లో చేరే అవకాశముందని తెలుస్తోంది. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సిద్దిపేట కలెక్టర్ గా వ్యవహరిస్తున్న వెంకట్రామిరెడ్డి గతంలోనూ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు....
ఇటీవల వరి వేస్తే ఉరి వేస్తానని ఆయన అధికారుల సమావేశంలో చేసిన హెచ్చరికలు వైరల్ అయ్యాయి. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. టీఆర్ఎస్ లో చేరేందుకే వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనేది రానున్న కాలంలో చూడాలి.
Next Story

