Wed Mar 11 2026 11:48:04 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం
నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు

నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు లోక్ భవన్ లో జరగనున్న కార్యక్రమంలో శివప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకరం చేయనున్నారు. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా తో చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించనున్నారు. లోక్‌భవన్‌లో కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు...
రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ ప్రమాణస్వీకారానికి హాజరు కానున్నారు. తెలంగాణకు నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా నియమితులైన సంగతి తెలిసిందే. శివప్రతాప్ శుక్లా నిన్ననే హైదరాబాద్ చేరుకోనున్నారు. గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణస్వీకారానికి లోక్ భవన్ లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
Next Story

