Sat Mar 07 2026 10:48:54 GMT+0530 (India Standard Time)
భక్తులతో కిక్కిరిసిపోయిన బాసర ఆలయం
బాసర దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

బాసర దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఈరోజు వేకువ జాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని ముందుగా అంచనా వేసిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు...
ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజు దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయని భావిస్తారు. అందుకే అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.
Next Story

