Fri Dec 05 2025 12:43:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోలులోనూ ఫోన్ ట్యాపింగ్ ?
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక మందిని విచారించిన సిట్ అధికారులు తాజాగా 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆడియోలను నాడు కేసీఆర్ విడుదల చేశారు. కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ అధికారుల ఆరా తీస్తున్నారు.
కేసీఆర్ విడుదల చేసిన...
కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ మీడియా సమావేశంలో విడుదల చేసిన పెన్ డ్రైవ్ పై దృష్టి పెట్టిన సిట్ అధికారులు ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రలోభలకు గురిచేసిన ఆడియోలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Next Story

