Sun Apr 27 2025 03:47:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫలించని దిగ్విజయ్ దౌత్యం
కాంగ్రెస్ నిర్వహిస్తున్న సదస్సుకు దూరంగా సీనియర్లు ఉన్నారు. అవగాహన సదస్సును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సదస్సుకు దూరంగా సీనియర్లు ఉన్నారు. బోయినపల్లిలో అవగాహన సదస్సును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ దూరంగా ఉన్నారు. కేవలం కోదండరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే హాజరయ్యారు. మిగిలిన అసంతృప్త సీనియర్ నేతలు ఎవరూ కాంగ్రెస్ సదస్సుకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దిగ్విజయ్ సింగ్ దౌత్యమూ ఫలించలేదు. ఆయన నచ్చ చెప్పినా సీనియర్లు వినలేదు.
సదస్సుకు దూరంగా సీనియర్లు...
మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసినా కాంగ్రెస్ సీనియర్లు దిగిరాలేదు. తాము పేర్కొన్న సమస్యలను పరిష్కరించకపోవడంపై సీనియర్ నేతలు ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. అందుకే ఏఐసీసీ అధ్యక్షుడు ఫోన్ చేసి నచ్చ చెప్పినా సదస్సుకు దూరంగా ఉన్నారని తెలిసింది. మాణికం ఠాగూర్ ను తప్పించాలన్నదే వారి ప్రధాన డిమాండ్. అది నెరవేరకుండా కార్యక్రమాలకు హాజరు కాకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Next Story