Fri Mar 27 2026 08:20:19 GMT+0530 (India Standard Time)
బీజేపీ సీనియర్ నేత మృతి
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. వరంగల్ జిల్లాలో జంగారెడ్డి జన్మించారు. ఆయన హన్మకొండలోనే నివాసం ఉంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఏకైక వ్యక్తి జంగారెడ్డి.
ఏకైక వ్యక్తిగా....
1985లో జరిగిన ఎన్నికల్లో ఆయన హన్మకొండ పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. బీజేపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. జంగారెడ్డి మృతి పట్ల భారతీయ జనతా పార్టీ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మ ృతి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
- Tags
- janga reddy
- bjp
Next Story

