Wed Jan 28 2026 22:41:19 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి రేవంత్ పై జగ్గారెడ్డి ఫైర్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ క్రమశిక్షణ చర్యలు వర్తించవా? అని ప్రశ్నించారు. పెద్దపల్లి అభ్యర్థిని రేవంత్ రెడ్డి నేరుగా ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయం చిన్నారెడ్డికి తెలియదా? అని నిలదీశారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి క్రమశిక్షణను ఉల్లంఘించవచ్చా? ఆయనకు నోటీసులు ఇవ్వారా? అని జగ్గారెడ్డి నిలదీశారు.
మీకు ఎవరైనా?
తాను పార్టీ హైకమాండ్ కు రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో మీడియా ముందు వివరించానన్నారు. తాను రాసిన లేఖపై మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం ముందుకు పిలిచిన తర్వాతనే తనను పిలవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Next Story

