Wed Jan 21 2026 01:00:18 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. ఎల్లుండి ప్రమాణం
కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సీనియర్ నేత వేణుగోపాల్ తెలిపారు.

కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిన్న ఎమ్మెల్యేలందరితో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించామని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో పార్టీని గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారన్నారు. డీకే శివకుమార్, మాణిక్యం థాక్రే శాసనసభ పక్షం అభిప్రాయాలతో కూడిన నివేదికను అందించామన్నారు.
అందరి అభిప్రాయాలను తీసుకున్న....
అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేశామన్నారు. రేవంత్ రెడ్డి డైనమిక్ గా వ్యవహరించారని, అందరిని కలుపుకుని పోయి పార్టీని అధికారంలోకి తెచ్చారన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేస్తారన్నారు.
Next Story

