Fri Dec 05 2025 10:27:48 GMT+0000 (Coordinated Universal Time)
వెయిట్ చేస్తే పదవి గ్యారంటీ.. అంటే ఇదే
సీనియర్ నేత ఇంద్రాసేనారెడ్డిని చాలా రోజుల తర్వాత పదవి వరించింది. త్రిపుర గవర్నర్గా నియమితులయ్యారు

సీనియర్ నేత ఇంద్రాసేనారెడ్డిని చాలా రోజుల తర్వాత పదవి వరించింది. భారతీయ జనతా పార్టీలో కొనసాగితే ఎప్పటికైనా పదవి గ్యారంటీ అన్నది మరోసారి ఇంద్రసేనారెడ్డి విషయంలో రుజువైంది. త్రిపుర గవర్నర్ గా ఆయనను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబు కూడా గవర్నర్ పదవిని పొందారు. తాజాగా తెలుగు రాష్టాల నుంచి గవర్నర్ పొందిన మరో నేతగా ఇంద్రసేనారెడ్డి బీజేపీ రికార్డుల్లోకి ఎక్కారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా...
ఇంద్రసేనారెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేశారు. అక్కడి నుంచే ఆయన బీజేపీలోకి ప్రవేశించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. మలక్పేట్ నుంచి ఆయన శాసనసభ్యుడిగా మూడుసార్లు విజయం సాధించారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. నల్లగొండ పార్లమెంటుకు అనేక సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తనకు పార్టీలో ఎలాంటి పదవులు దక్కకున్నా కమలాన్నే అంటిపెట్టుకున్న ఆయనకు చివరకు గవర్నర్ పదవి లభించడంతో ఆయన సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

