Sun Mar 15 2026 14:30:03 GMT+0530 (India Standard Time)
ఆల్ సెటిల్డ్ .. నో ప్రాబ్లం
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు లేవని అన్నీ సెటిల్ అయ్యాయని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు లేవని అన్నీ సెటిల్ అయ్యాయని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభేదాలపై బయట మాట్లాడవద్దని ఆయన తెలిపారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా కూర్చుని చర్చించుకోవాలని అన్నారు. అంతా కలసి పనిచేయాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
అంతా కలసి పనిచేయాలని....
ఏ పార్టీలో అయినా విభేదాలు సహజమేనని, అయితే వీధిన పడటం పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. పార్టీలో సీనియర్, జూనియర్ అన్న ప్రస్తావనలు తేవద్దని కూడా సూచించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని దిగ్విజయ్ సింగ్ నేతలను కోరారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, కలసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story

