Mon Mar 16 2026 06:29:35 GMT+0530 (India Standard Time)
నేడు కాంగ్రెస్లోకి డిఎస్ తనయుడు
సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు సంజయ్ నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు.

సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు సంజయ్ నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. డీఎస్ తనయుడు బండి సంజయ్ చేరికను నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ కుటుంబం పార్టీ కష్టసమయంలో మోసం చేసి వెళ్లిపోయిందంటూ కొందరు అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.
అభ్యంతరం తెలిపినా...
అయితే ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీలో ఉన్న హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి తన పెద్దకుమారుడు ధర్మపురి సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చేందుకు ప్రయత్నించారు. డీఎస్ శ్రమ ఫలించింది. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈరోజు సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు.
Next Story

