Wed Mar 25 2026 14:06:04 GMT+0530 (India Standard Time)
అలాగయితే నేనే సీఎం : జానారెడ్డి
సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు

సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవే తనను అందుకుంటుందని, తాను పదవుల రేసులో లేనని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నానంటూ ఆయన సంకేతాలిచ్చారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టే ఎక్కువ మంది పార్టీలోకి వస్తున్నారని ఆయన అంచనా వేశారు.
తన కొడుకు రాజీనామా చేసి...
ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు కాలేదా? అని ఆయన అన్నారు. అవసరమైతే తన కొడుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని, తాను ఎమ్మెల్యేను అవుతానని ఆయన తెలిపారు. కాగా జానారెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు జయవీర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం రేసులో ఉన్నానని ఆయన చెప్పడం ఇప్పుడు పార్టీలోనూ, రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
Next Story

