Fri Dec 05 2025 14:44:53 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ ఐపీఎస్ కొత్తకోట పుస్తకరచయితగా మారి
సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్త కోట శ్రీనివాసరెడ్డి పుస్తక రచయితగా మారారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్త కోట శ్రీనివాసరెడ్డి పుస్తక రచయితగా మారారు. దాదాపు మూడు దశాబ్దాలు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసినకొత్త కోట శ్రీనివాసరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఇటు తనకు అప్పగించిన శాఖలో నిరంతరం బిజీగా ఉంటూనే మరొకవైపు పుస్తక రచయితగా మారడం విశేషం. తన స్వీయ అనుభవాలను కొత్త కోట శ్రీనివాసరెడ్డి "పుంజు తోక" పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో తనకు పోలీసు శాఖలో నిర్వహించిన బాధ్యతల్లో ఎదురైన అనుభవాలను వివరించారు.
విధినిర్వహణలో తాను ఎదుర్కొన్న...
తాను పనిచేసిన ప్రాంతంలో ఎదురైన అనుభవాలను కూడా పుంజుతోక పుస్తకంలో వివరించారు. 1994 బ్యాచ్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి కొత్త కోట శ్రీనివాసరెడ్డి విధినిర్వహణలో తాను ఎదుర్కొన్న వింత అనుభవాలను కూడా ఈ పుంజుతోక పుస్తకంలో తెలిపారు. ఆయన ఒకవైపు పోలీసు శాఖలో వివిధ పనుల్లో తలమునకలై ఉన్నప్పటికీ పుస్తక రచయితగా మారి ఆయన తన అనుభవాలను ఇందులో వివరించారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలతో పాటు మానవ సంబంధాలపట్ల స్పందిస్తూ ఆయన పుస్తకాన్ని ప్రజల ముందుకు తెచ్చారు.
అన్ని రకాల అంశాలను...
"పుంజు తోక" పుస్తకంలో అన్ని రకాల రసాలను ఆవిష్కరించారు. హాస్యం, బీభత్స, కరుణ, అద్భుత, రౌత్ర, శాంత, వీర వంటి అంశాలను ప్రస్తావించి పుస్తక ప్రియులకు సరికొత్త అనుభవాన్ని కొత్తకోట శ్రీనివాసరెడ్డి అందించే ప్రయత్నం చేశారు. ఈ "పుంజు తోక" పుస్తకంలో 120 అంశాలపై కవితలను కూడా రచించారు. విధినిర్వహణలో శాఖలోనే కాకుండా, ప్రభుత్వంలోనూ, సమాజంలోనూ మంచి పేరు తెచ్చుకున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన "పుంజు తోక" పుస్తకం యువ పోలీసు అధికారులకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని చెబుతున్నారు. పదునైన పదాలను ప్రయోగించి లాఠీతో పాటు పెన్ను కూడా పవర్ ఫుల్ అని నిరూపించగలిగారు. నేడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఈ "పుంజు తోక" పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
Next Story

