Sun Mar 08 2026 09:01:38 GMT+0530 (India Standard Time)
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీహెచ్ హల్ చల్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనను, జగ్గారెడ్డిని టీఆర్ఎస్ కోవర్టులుగా చూపుతు కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారని వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తనను టీఆర్ఎస్ ...
అయితే ఈ సందర్బంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వి.హనుమంతరావుకు, సీఐకి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తనతో కేసీఆర్ ను పక్కన పెట్టి, తమకు టీఆర్ఎస్ కండువాలు కప్పుతూ తీసిన ఫొటోలను ఆయన సీఐకి చూపారు. సీనియర్ నేతలను బయటకు పంపాలన్న కుట్ర జరుగుతుందని వి.హనుమంతరావు ఆరోపించారు.
Next Story

