Wed Jan 21 2026 09:31:13 GMT+0000 (Coordinated Universal Time)
మర్రి శశిధర్ రెడ్డి పై వేటు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు బహిష్కరించింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించింది. ఈ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని, అది నయమయ్యే పరిస్థితి లేదని మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలకు దిగింది.
బహిష్కరించిన కాంగ్రెస్...
మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుగానే ఆయనపై చర్యలను పార్టీ తీసుకుంది. ఆయన అమిత్ షాను కలసి చర్చలు జరపడంతో పార్టీని వీడతారని వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని విలేకర్లతో అనడంతో ముందుగానే ఆయనను పార్టీ బహిష్కరించింది.
Next Story

