Wed Jan 21 2026 09:55:04 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఘాటుగా స్పందించారు

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ మాణికం ఠాగూర్ రేవంత్ రెడ్డి ఏజెంట్ గా మారారన్నారు. సీనియర్లను గోడకేసి కొడతానని అన్నా పట్టించుకోలేదన్నారు. కనీసం అలా అన్నవారిని పిలిచి మందలించక పోవడం విచారకరమని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
పార్టీని నడిపిస్తున్న వారే...
కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరికాదని మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వారి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండాల్సిందన్నారు. పార్టీని నడిపిస్తున్న వారే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కల్లోలానికి కారణమని ఆయన అన్నారు. రేవంత్ అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.
Next Story

