Thu Feb 12 2026 12:12:01 GMT+0530 (India Standard Time)
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. విద్యాశాఖ అధికారులు ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. విద్యాశాఖ అధికారులు ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. మే 11 వత తేదీ నుంచి 20 వతేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నంచి 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ లో అధికారులు తెలిపారు.
ఉదయం 9.30 గంటలకు....
పదో తరగతి విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించడంతో విద్యాసంస్థల్లో పోర్షన్ ను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. పోర్షన్ పూర్తయితే మరోసారి రివిజన్ కూడా చేయాలని కోరారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టినందున పరీక్షలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పారు.
Next Story

