Sun Mar 15 2026 20:14:57 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్ లకు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేటి నుంచి అములులోకి వచ్చింది. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. జనవరి 31వ తేదీన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు విధించారు.
పోలింగ్ ఫిబ్రవరి 11న...
ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ఉండనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనంుది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పార్టీ గుర్తుల మేరకు ఈ ఎన్నికలు జరగననున్నాయి.
Next Story

