Sun Mar 15 2026 14:48:27 GMT+0530 (India Standard Time)
Telangana : ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఖమ్మం - నల్లగొండ - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది.

తెలంగాణలో మరో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. ఖమ్మం - నల్లగొండ - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది మే 2వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఆరోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మే 9వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు.
జూన్ 5న లెక్కింపు...
మే 10వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. మే 13వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ను విధించారు. మే 27 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. గత ఎన్నికల్లో ఈస్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలవడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది.
Next Story

