Sun Feb 01 2026 04:43:09 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కేసీఆర్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది

బీఆర్ఎస్ అధినేత లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఆయన జనం బాట పట్టనున్నారు. బస్సు యాత్రతో నియోజకవర్గాలను పర్యటించనున్నారు. సోమవారం మిర్యాలగూడలో రోడ్ షోను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం హుజూర్ నగర్, కోదాడ మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే కేసీఆర్ బస చేయనున్నారు.
రాత్రి బస జిల్లాలోనే...
తర్వాత రాజు సూర్యాపేట నుంచి బయలుదేరి తిరుమలగిరి, జనగామ, ఆలేరు మీదుగా రాత్రికి ఎర్రవెల్లి ఫాం హౌస్ కు వెళతారు. మూడో రోజు వరంగల్ జిల్లాలో ఆయన పర్యటన సాగనుంది. రోడ్ షోలతో పాటు మధ్యలో ఎండిన పొలాలను పరిశీలిస్తూ బహిరంగ సభల ద్వారా జనంలోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా పార్టీలకు ఆదేశాలు అందాయి.
Next Story

