Fri Dec 05 2025 14:59:25 GMT+0000 (Coordinated Universal Time)
సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
తెలంగాణ లో సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. దీంతో నేడు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు

తెలంగాణ లో సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. దీంతో నేడు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అనేకచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను అక్కడే వదిలేసిన భక్తులు కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
రేపటితో ముగింపు కావడంతో...
సరస్వతి పుష్కరాలు ప్రారంభమై నేటికి పదకొండు రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరజు ఉదయం నుండి లక్షలాది మంది త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ కేడింగ్ దాటి భక్తులు సంగమంలోకి రాకుండా పటిష్ట బందోబస్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story

