Sun Mar 08 2026 02:48:47 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : కవితతో మాజీ మంత్రులు భేటీ
తీహార్ జైలుకు వెళ్లిన సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు కవితతో సమావేశమయ్యారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మాజీ మంత్రులు భేటీ అయ్యారు. తీహార్ జైలుకు వెళ్లి ఆమె పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉదయం తీహార్ జైలుకు వెళ్లిన సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు కవితతో సమావేశమయ్యారు. కవితతో మాజీ మంత్రులిద్దరూ కాసేపు ముచ్చటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...
జైలులో అందుతున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీన కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం కవిత వేచి చూస్తున్నారు.
Next Story

