Fri Dec 05 2025 11:23:00 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కర్షకుల కుటుంబాలు హ్యాపీ.. నిధులు జమ అవుతుండటంతో ఆనందం
తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు జమ అవుతున్నాయి

తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు జమ అవుతున్నాయి. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే వరసగా ఇప్పటి వరకూ ప్రతి రోజూ రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. రైతుల అకౌంట్లోకి ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాలు కురుస్తుండంతో సాగుకు అనుకూలంగా మారింది. వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా మారిపోయారు. సాగుకు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. దుక్కి దున్ని విత్తనాలు నాటేందుకుసిద్ధమవుతుందన్నారు.
సాగు సిద్ధం కావడంతో...
దీంతో పాటు ఎరువులు పురుగు మందులు కూడా కొనుగోలు చేయాల్సి ఉండటంతో రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి జమ అయ్యే నిధులు ఉపయోగపడనున్నాయి. నాలుగు ఎకరాలున్న రైతులకు ఇరవై నాలుగువేల రూపాయలు పడుతుండటంతో రైతులు ఖుషీగా ఉన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం సమయంలోనే రైతుల ఖాతాల్లోనే నిధులను జమ చేస్తున్నారు. మొత్తం అరవై లక్షల మంది వరకూ రైతులు లబ్ది పొందే అవకాశముంది. సాగుకు అనుకూలమైన భూములకు ఎకరానికి ఆరువేల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నారు.
నిధులు విడుదల చేయడంతో...
కేవలం అటవీభూములు, వివాదాస్పద భూములు, గృహావసరాలకు వినియోగించే భూములు మినహా సాగుకు అనుకూలంగా ఉండే భూములన్నింటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అందరికీ దాదాపు నిధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం నాలుగు రోజుల్లోనే తెలంగాణాలో రైతు భరోసా కింద ప్రభుత్వం 6,405 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రైతుభరోసా పంపిణీ ఇప్పటికే పూర్తయిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నేడు మరో పదిహేను కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీంతో రైతుల ఖాతాల్లో నిధులు పడుతుండటంతో కర్షకుల కుటుంబాల్లో ఆనందం నిండిపోయింది.
Next Story

