Fri Jan 30 2026 11:02:57 GMT+0000 (Coordinated Universal Time)
మాస్టర్ ప్లాన్ రద్దు : కౌన్సిల్ తీర్మానం
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ లో పాలకవర్గం తీర్మానం చేసింది.

మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ లో పాలకవర్గం తీర్మానం చేసింది. రైతులు గత కొంతకాలం చేస్తున్న ఆందోళనలకు దిగి వచ్చిన మున్సిపల్ పాలకవర్గాలు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
రైతుల ఉద్యమంతో...
అయితే దశల వారీగా రైతులు ఉద్యమ కార్యాచరణ ను ప్రకటించారు. మున్సిపల్ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటితో వారికిచ్చిన గడువు పూర్తయింది. నేటి నుంచి కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడికి రైతులు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ లు అత్యవసరంగా సమావేశమై మాస్టర్ ప్లాను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసినట్లు తెలిసింది.
Next Story

