Wed Jan 21 2026 22:27:23 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : పోలీస్ బాస్ ల బదిలీలు.. ఎవరెవరు ఎక్కడంటే?
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అందులో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ను నియమించారు. ప్రస్తుత హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్న సీవీ ఆనంద్ ను హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని నియమించారు.
కీలక పదవుల్లో...
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా శిఖాగోయల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారు సిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతి లక్రాకు అదనపు బాధ్యతలను అప్పగించారు. అదే సమయంలో ఇంటలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్ ను నియమించారు. మల్టీజోన్ 2 ఐటీగా డీఎస్ చౌహాన్, విపత్తు నిర్వహణ ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారు.
Next Story

