Fri Dec 05 2025 21:53:30 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
ఆర్టీసీ ఉద్యోగులకు ఉగాదికి ముందే తీపికబురు అందింది. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆర్టీసీ ఉద్యోగులకు ఉగాదికి ముందే తీపికబురు అందింది. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులందరిపై ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఉద్యోగులందరికీ డీఏను ప్రకటించింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డీఏను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
3.6 కోట్ల భారం...
తెలంగాణలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ 2.5 శాతం డీఏను పెంచినట్లు తెలిపారు. ఈ పెంచిన డీఏను వెంటనే చెల్లిస్తామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సర్వీసులు ప్రవేశ పెడుతుండటంతో పాటు పెరిగిన డీఏతో ఇప్పుడు అదనంగా ప్రభుత్వంపై డీఏ ప్రకటన కారణంగా 3.6 కోట్ల భారం పడనుంది.
Next Story

