Tue Mar 31 2026 19:30:41 GMT+0530 (India Standard Time)
రేవంత్ పై ప్రవీణ్ సంచలన కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని చంద్రబాబు తెలంగాణలో పెట్టారన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదని, వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారన్నారు. దాన్ని ఎందుకు రిపేర్ చేయడంలేదని, పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే రిపేర్ చేయడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తే.. ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాలై ఇంటికి వెళ్తున్నారన్నారు.
అమెరికాకు ఉన్నత చదువులు..
గద్వాల జిల్లా అయిజ మండలంలో నిరీక్షణ, ప్రసన్న అనే అమ్మాయిలకు చిన్నతనంలోనే బాల్యవివాహాలు చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నా తల్లిదండ్రులను ఎదురించి నిరీక్షణ అనే అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివిందన్నార. ప్రసన్న అనే అమ్మాయి ఢిల్లీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సుకు వెళ్ళిందని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇప్పటివరకి 127 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు
Next Story

