Wed Nov 06 2024 13:24:04 GMT+0000 (Coordinated Universal Time)
లడఖ్ లో ప్రాణాలు వదిలిన తెలుగు ఆర్మీ జవాన్
లడఖ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ఆర్మీ సైనికులు చనిపోయారు
లడఖ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ఆర్మీ సైనికులు చనిపోయారు. చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన జవాను కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగేళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తీర్మాన్ దేవునిపల్లికి చెందిన జవాన్ చంద్రశేఖర్ మరణించాడని ఆర్మీ తెలిపింది. పేద కుటుంబానికి చెందిన మల్లయ్య, శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో చంద్రశేఖర్ అందరి కంటే చిన్నవాడు. చంద్రశేఖర్ మృతితో షాద్ నగర్లో విషాదం నెలకొంది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం లేహ్‌లో ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు వీరమణం పొందారు. దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని ఖేరి వద్ద శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
దేవునిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య,శివమ్మల కుమారుడు చంద్రశేఖర్. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 2011లో ఆర్మీ లో జాయిన్ అయ్యాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్ మరణ వార్త తెలిసి అటు తల్లి దండ్రులు, ఇటు భార్య శోక సంద్రంలో మునిగిపోయారు. దేవునిపల్లి గ్రామంలోనూ ఒక్క సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు చంద్రశేఖర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
Next Story