Sun Dec 14 2025 00:22:36 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. పద్దెనిమిది మంది మృతి
తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందినట్లు తెలిసింది

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందినట్లు తెలిసింది. టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు వెళుతుండగా కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఇరవై మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. కంకర లోడుతో వెళుతున్న లారీ మితి మీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కంకర మీద పడి...
ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణికలు అధిక సంఖ్యలో చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్భయి మంది వరకూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, అటు వెళుతున్న వాహనదారులు సహాయక చర్యల్లో పాల్లొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదంతో ఆ రూట్ లో రెండు నుంచి మూడు కిలోమీటర్ వరకూ ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. జేసీబీని తీసుకు వచ్చి అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.
విద్యార్థులు.. ఉద్యోగులే...
ప్రయాణికులపై కంకర పడటంతో ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అంబులెన్స్ లు కూడా వెళ్లాయి. కానీ అప్పటికే కంకర కింద పడిన మృతదేహాలను వెలికి తీస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని తెలిసింది. సోమవారం కావడంతో కళాశాలలకు హాజరయ్యేందుకు విద్యార్థులు, విధులకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఈ బస్సులో బయలుదేరి వస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

