Sun Mar 15 2026 13:58:08 GMT+0530 (India Standard Time)
Rice Prices : యుద్ధం ఎఫెక్ట్... పడిపోయిన బియ్యం ధరలు
బియ్యం ధరలు అందుబాటులోకి వస్తున్నాయి.

బియ్యం ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎగుమతులు కావడంతో బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. అంటే సన్న బియ్యం మార్కెట్ లో తక్కువగా లభించడం, ఎగుమతులు ఎక్కువగా జరుగుతుండటంతో బియ్యం ధరలు మన మార్కెట్ లో కొంత ఎక్కువగానే ఉన్నాయి. అయితే నేడు మాత్రం బియ్యం ధరలు పడిపోయినట్లు మార్కెట్ లో వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయిన బియ్యం విదేశాల ఎగుమతి నిలిచిపోవడంతో తక్కువ ధరకే మార్కెట్ లో లభిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
యుద్ధం ఎఫెక్ట్ తో...
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మేరకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా రూ.2,550 ఉండగా ప్రస్తుతం రూ.2,450కి తగ్గింది. మరో రూ.150 వరకు తగ్గే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్లో మరో 145 ఎల్ టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.
రేక్స్ కొరత లేదు: కేంద్రం
తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్ను సమృద్ధిగా కేటాయిస్తామని కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ అందించే రిపోర్టుల ఆధారంగానే రైల్వే బోగీల కేటాయింపు జరుగుతుందని కేంద్రం వివరించింది. ఎంపీ కడియం కావ్య లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ, 2026 జనవరి నాటికి సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం లోడింగ్ పూర్తయిందని, దీని కోసం1,329 రైల్వే రేక్స్ను వినియోగించినట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మొత్తానికి యుద్ధం ప్రభావంతో బియ్యం ధరలు కొనుగోలు దారులకు అందుబాటులోకి వచ్చాయి. రైతులకు మాత్రం కన్నీరు తెప్పిస్తున్నాయి.
Next Story

