Wed Feb 08 2023 07:28:39 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో చేగువేరా కుమార్తె
విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె, మనవరాలు హైదరాబాద్ కు వచ్చారు. ఈరోజు జరిగే కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.

విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె, మనవరాలు హైదరాబాద్ కు వచ్చారు. ఈరోజు జరిగే కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, మనవరాలు ఎస్తే ఫానియా లు ఈరోజు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. క్యూబా సంఘీభావ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
సంఘీభావ సభలో...
నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా తెలంగాణ కమిటీ ఈ సంఘీభావ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు ముఖ్యఅతిధులుగా వీరు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సభకు వివిధ రాజకీయపార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు కూడా పాల్గొననున్నారు.
Next Story