Wed Mar 18 2026 03:14:51 GMT+0530 (India Standard Time)
నాకు లంచం వద్దు.. అధికారి నిజాయితీ
తనకు లంచం వద్దంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చిలకరాజు నర్సయ్య విన్నూత్నంగా చేపట్టిన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది

తనకు లంచం వద్దంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చిలకరాజు నర్సయ్య విన్నూత్నంగా చేపట్టిన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. తోటి రెవెన్యూ ఉద్యోగులకు ఇది ఇబ్బందికరంగా మారింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ఆర్ఐ చిలకరాజు నర్సయ్య తనకు లంచం వద్దంటూ చొక్కా కు కార్డు పెట్టుకుని విధులకు హాజరయ్యారు.
తోటి ఉద్యోగులకు సవాల్...
ఇది తోటి ఉద్యోగులకు సవాల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. నర్సయ్యను చూసి తోటి ఉద్యోగులు నేర్చుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అందరూ ఇలా ఉంటే ఇక లంచం మాట విననపడదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Next Story

