Tue Mar 24 2026 11:08:06 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి నివాసంలో జరగనున్న వేడుకకు ఆయన హజరయ్యేందుకు వెళ్లనున్నారు. ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి రేపు కూడా అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ అగ్రనేతలను కలిసి...
ఈ పర్యటనలో పార్టీ అగ్రనేతలను కలిసే అవకాశముందని తెలిసింది. ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో పాటు పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలపై హైకమాండ్ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశముంది.
Next Story

