Fri Dec 05 2025 21:18:36 GMT+0000 (Coordinated Universal Time)
Medaram Jathara: 23న మేడాారానికి రేవంత్
తెలంగాణలో అతి పెద్ద జాతరైన మేడారానికి ఈ నెల 23వ తేదీన రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు

Medaram Jathara: తెలంగాణలో అతి పెద్ద జాతరైన మేడారానికి ఈ నెల 23వ తేదీన రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనదేవతలను సందర్శించనున్నారు. మొక్కులు చెల్లించుకోనున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని మంత్రి సీతక్క తెలిపారు. అదే రోజు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కూడా మేడారానికి వస్తారని చెప్పారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ మేడారం జాతర జరగనుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి...
ఈ జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో మంచినీటి సౌకర్యం తో పాటు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. పుణ్యస్నానాల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని, అలాగే లక్షలాది మంది కోసం అవసరమై మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని కూడా ఆమె తెలిపారు. గవర్నర్, ముఖ్యమంత్రి ఈ నెల 23న వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఆరువేల బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. భక్తులు పెద్దసంఖ్యలో రానునన్నందున అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.
Next Story

