Sun Mar 15 2026 07:40:06 GMT+0530 (India Standard Time)
Revanth reddy : కామారెడ్డిలో రేవంత్ నామినేషన్
కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 8న నామినేషన్ వేయనున్నారు

కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 8న నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేయనున్నారు. ఈ నెల 6న కొడంగల్ లో నామినేషన్ వేసిన తర్వాత 8వ తేదీన కామారెడ్డిలో ఆయన తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయనున్నారు.
భారీ బహిరంగ సభ...
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు ఆయన రెండు చోట్ల బరిలోకి దిగనున్నారు. కామారెడ్డిలో అదేరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యఅతిధిగా హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ కూడా రెండు చోట్ల పోటీ చేస్తుండటం గమనార్హం.
Next Story

