Fri Jan 30 2026 02:33:45 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : పెద్దమ్మ గుడిలో రేవంత్ పూజలు
రేవంత్ రెడ్డి పెద్దమ్మగుడికి రానున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు

కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దమ్మగుడికి రానున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతో పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ఎల్.బి. స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకోనున్నారు.
భారీ భద్రత నడుమ...
కాగా రేవంత్ రెడ్డి ఇంటికి చీఫ్ సెక్రటరీ శాంతకుమారి చేరుకోనున్నారు. ఆమె అక్కడి నుంచి ఎల్.బి. స్టేడియానికి రేవంత్ ను తోడ్కొని వెళ్లనున్నారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరినీ రానివ్వడం లేదు. ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి జాతీయ నేతలు చేరుకోనున్నారు.
Next Story

