Sat Mar 28 2026 05:57:29 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు పరిగిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగుతుంది. పరిగి మండలంలోని నారాయణపూర్ లో ప్రజాపాలన - ప్రగతి బాట బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళ శక్తి చెక్కులను అందచేయనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు.సభకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

