Tue Apr 07 2026 06:10:56 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ముంబైకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు ముంబైకి వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు పార్టీ నేతలను కూడా కలవనున్నారు.
రేపు ఢిల్లీకి వెళ్లి...
అలాగే కొందరు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. ప్రధానంగా మూసీ రివర్ పునరుజ్జీవం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మంత్రులను కలసి సహకరించాలని కోరనున్నారు. అలాగే వివిధ రైల్వే ప్రాజెక్టులను గురించి చర్చించనున్నారు.
Next Story

