Thu Mar 26 2026 19:23:00 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పడండిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేడు కూడా కొనసాగుతుంది. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన స్థానిక నేతలతో భేటీ అవుతారు.
మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం, ఎలక్షనీరింగ్ పై నేతలతో రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలా తీసుకెళ్లాలన్నది చెబుతారు. అనంతరం గుములాపూర్ లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభకు భారీ జనసమీకరణకు నేతలు ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

