Thu Mar 26 2026 16:21:46 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు భూపాలపల్లి జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు భూపాలపల్లి జిల్లా రేగొండి మండలం కడవటంచ గ్రామానికి చేరుకోనున్నారు. తొలుత లక్ష్మీ నరసిహంహ స్వామి ఆలయాన్ని రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
అనంతరం చెల్పూరులో ప్రజా పాలన - ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. రెండేళ్లు తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను వివరిస్తూ, సంక్షేమ పథకాలను అందించిన విషయాలను గుర్తు చేస్తూ విపక్ష పార్టీల పాలనపై విమర్శలు చేయనున్నారు.
Next Story

