Fri Apr 03 2026 14:05:58 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రైజింగ్ తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కట్టడాలకు, ముత్యాలకు ప్రసిద్ధి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే చేనేత రంగానికి కూడా తెలంగాణ ప్రసిద్ధి అని తెలిపారు. తెలంగాణ డీఎన్ఏలోనే టెక్స్ టైల్స్ ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తయారయ్యే వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు.
టెక్సైటైల్స్ పరిశ్రమలో కూడా..
చేనేత రంగంతో పాటు టెక్స్ టైల్స్ పరిశ్రమను కూడా రాష్ట్రంలో ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం తాము ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ తెలంగాణ అభివృద్ధిని ఆపలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story

