Tue Jan 20 2026 15:22:54 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : సాయంత్రంలోగా కమిషన్ ఛైర్మన్ ను నియమిస్తాం
విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంపై విచారణ కమిషన్ ను ఈ సాయంత్రానికి ప్రకటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంపై విచారణ కమిషన్ ను ఈ సాయంత్రానికి ప్రకటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ విచారణ కోరింది వాళ్లేనని, విచారణ వేస్తే న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంటున్నారని అన్నారు. సత్యహరిశ్చంద్రుల్లా బిల్డప్ ఇచ్చి పారిపోయింది ఎవరంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్తు అంశంలో న్యాయవిచారణను కోరింది జగదీశ్వర్ రెడ్డి మాత్రమేనని, తాము ఆయన డిమాండ్ మేరకే విచారణ కమిషన్ వేశామని తెలిపారు.
న్యాయవిచారణ కోరింది....
జగదీష్ రెడ్డి ఆవేదన చూస్తుంటే చర్లపల్లి జైలులో ఉన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఛత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి పవర్ పాయింట్ ప్లాంట్ న్యాయ విచారణ జరుగుతుందని అన్నారు. ఎవరి నిజాయితీ ఏందో తెలిసిపోతుందన్నారు. న్యాయవిచారణ కోరింది వాళ్లేనని, ఇప్పుడు వద్దంటుంది కూడా వాళ్లేనని రేవంత్ అన్నారు. ఈరోజు సాయంత్రానికి విచారణ కమిషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమిస్తామని సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Next Story

