Sat Feb 21 2026 19:40:36 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరైనా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశముందని అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఎవరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా వారిని వేధించే సంస్కృతి పార్టీలో లేదన్నారు. మనంలో మనం వాదులాడుకున్నా, కొట్లాడుకున్నా పార్టీ కోసం కష్టపడే లక్షలాది మంది కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రజల కోసం నిరంతరం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. నెహ్రూ దేశం కోసం ఎన్నో ఏళ్లు జైలులో ఉన్నారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
మెరిట్ లిస్ట్ ప్రకారమే...
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ పాదయాత్ర చేశారన్న రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అయ్యే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీలోనూ తనకు వ్యతిరేకత ఎదురయిందని, నేతలందరినీ తన ఆలోచనలకు అనుగుణంగా మలచుకున్నానని రేవంత్ రెడ్డి తెిపారు. అందరం సమిష్టిగా కృషి చేయడం వల్లనే పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. పదవులు మెరిట్ లిస్ట్ ప్రకారమే అందరికీ వస్తాయని చెప్పారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరు మీద నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు.
Next Story

