Thu Feb 26 2026 13:56:22 GMT+0530 (India Standard Time)
Revanth REddy నేడు నీటి ఎద్దడి పై రేవంత్ సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వేసవి నీటిఎద్దడి, సవాళ్లపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు

తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటాయి. వేసవి రావడంతో అనేక చోట్ల తాగు నీటి సమస్యలు తలెత్తాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడువేసవి నీటిఎద్దడి, సవాళ్లపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో హైదరాబాద్ మహా నగరానికి అవసరమైన తాగు నీటిని అందించడంతో పాటు ఇతర మార్గాలపై చర్చించనున్నారు.
భూగర్భ జలాలు అడుగంటి...
అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నెలకొనే అవకాశముందని అధికారులు ముందస్తుగానే గుర్తించారు. తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి నేడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భూ గర్భ జలాల పెరుగుదలకు, తాగు నీటి సరఫరాకు అవసరమైన చర్యల గురించి చర్చిస్తారు.
Next Story

