Thu Mar 26 2026 20:47:44 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు రేవంత్ కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో డీసీసీ చీఫ్ లు, ముఖ్యనేతలు కూడా పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థులకు ఇప్పటికే బీఫారాలు అందచేయాలని నిర్ణయించారు. రెబెల్స్ కు ఆయన స్వయంగా హామీ ఇచ్చే అవకాశముంది.
రేపటి నుంచి జిల్లాల పర్యటన...
రేపటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంతో పాటు హామీలు ఇవ్వడం, గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉండనుంది. రేపు మిర్యాలగూడలోనూ, ఐదో తేదీన చొప్పదండి, ఆరో తేదీన నిజామాబాద్ రూరల్, ఏడో తేదీన పరిగి, 8వ తేదీన భూపాల్ పల్లి, 9న మెదక్ లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.
Next Story

