Fri Dec 05 2025 15:38:11 GMT+0000 (Coordinated Universal Time)
భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్
భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్ రెడ్డి బయలుదేరారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ కు ప్రమాణానికి సిద్ధమయ్యారు.

భాగ్యలక్ష్మి ఆలయానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌పై ఆయన ప్రమాణానికి సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికార బీఆర్ఎస్ పార్టీ 25 కోట్ల రూపాయలను ఇచ్చిందని, అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, రేపు ఎన్నికల తర్వాతనైనా ఒక్కటవుతాయని ఈటల చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెస్పాండ్ అయ్యారు.
ఈటలకు సవాల్...
అది నిరూపించగలవా? అని సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి ఆలయంలో తమకు ఎలాంటి నిధులు బీఆర్ఎస్ నుంచి అందలేదని ప్రమాణం చేస్తానని తెలిపారు. అందుకు ఈటల రాజేందర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. అయితే తన వద్ద అందుకు ఆధారాలు లేకపోవచ్చని, 25 కోట్లు కేసీఆర్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఈటల మళ్లీ స్పందించారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడానికి భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బయలుదేరి వెళ్లారు.
Next Story

